ఫ్లై ఓవర్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
MBNR: దేవరకద్ర నియోజకవర్గంలో మదనపురం-కొత్తపల్లి మధ్య ఊక చెట్టు వాగుపై నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఇంజనీర్లు, అధికారులకు, కాంట్రాక్టర్లకు ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.