పోలవరం జిల్లాలోకి మళ్లీ పెద్దపులి
ASR: నిన్నటివరకు కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సంచరించిన పెద్దపులి బుధవారం రాత్రి మరలా పోలవరం జిల్లాలోకి ప్రవేశించినట్లు అధికారులు వెల్లడించారు. రాజవొమ్మంగి మండలంలోని కొండ లింగంపర్తి, కొత్తపల్లి గ్రామాల సమీపంలో అటవీప్రాంతంలో రాత్రి పులి సంచరించినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం పులి బోర్నగూడెం సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది.