“మీకోసం” కార్యక్రమంలో 30 ఫిర్యాదులు

కృష్ణా: మచిలీపట్నం పోలీసు కార్యాలయంలో సోమవారం “మీకోసం” కార్యక్రమం జరిగింది. ఎస్పీ ఆర్. గంగాధరరావు, స్వయంగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 30 మంది ఫిర్యాదుదారులు తమ సమస్యలను ఎస్పీకి తెలిపినట్లు పేర్కొన్నారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, వేధింపులు తదితర సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేశారు.