BYPOLL: 31.94 శాతం పోలింగ్ నమోదు @1PM
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంత వాతవరణంలో కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 31.94 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. బస్తీలో తప్ప మిగతా ప్రాంతాల్లో ఎక్కడ ఓటింగ్ కనిపించట్లేదు. అయితే, దివ్యాంగులు, వృద్ధులు మాత్రం చురుకుగా పాల్గొంటున్నారు. ఇప్పటికైనా నియోజకవర్గ యువత ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు రావాలని కోరుతున్నారు.