కాళేశ్వరం-మద్దులపల్లి రహదారిలో వరద.. రైతుల ఆందోళన

కాళేశ్వరం-మద్దులపల్లి రహదారిలో వరద.. రైతుల ఆందోళన

BHPL: మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం-మద్దులపల్లి రహదారిలో చండ్రుపళ్లి వద్ద లో-లెవల్ వంతెనపై వరద నీరు ప్రవహిస్తుండటంతో బుధవారం చండ్రుపళ్లి, మద్దలపెళ్లి గ్రామాల నుంచి కాళేశ్వరానికి రాకపోకలు నిలిచిపోయాయి. వాగు పరివాహక ప్రాంతంలోని పంట పొలాలు నీటితో మునిగాయి. నీరు నిలిచి ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.