12న తిరుపతి రానున్నమాజీ ఉపరాష్ట్రపతి

TPT: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 12న తిరుపతికి రానున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. కచ్చిపి ఆడిటోరియంలో జరిగే 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' సెమినార్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు. సాంస్కృతిక విద్యాపీఠంలో నూతన భవనాన్ని ప్రారంభించిన అనంతరం గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ సంస్మరణ సభలో పాల్గొననున్నారు.