బెంగళూరు నుంచి అయోధ్యకు సైకిల్ యాత్ర

ADB: బెంగళూరు నుండి అయోధ్యకు యువకులు చేపట్టిన సైకిల్ యాత్ర మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. వీరికి స్థానిక శ్రీ గోపాలకృష్ణ మఠం వద్ద మఠాధిపతి యోగానంద సరస్వతి, నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం యాత్రికులను ఘనంగా సన్మానించి సాగనంపారు. నేటి యువతకు సనాతన హిందూ ధర్మం విశిష్టత గురించి తెలియజేయడానికి యాత్ర చేపట్టినట్లు యాత్రికుడు రవి తెలిపారు.