పోరుమామిళ్ల నూతన సీఐగా హేమ సుందర్ రావు
KDP: పోరుమామిళ్ల సీఐగా హేమ సుందర్ రావు నిన్న బాధ్యతలు స్వీకరించారు. గతంలో రైల్వే కోడూరు అర్బన్ పీఎస్ సీఐగా పనిచేసిన ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటూ, గ్రామీణ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన డీ.శ్రీనివాసులు రైల్వే కోడూరు రూరల్‌కు బదిలీ అయ్యారు.