మినరల్ వాటర్ ప్లాంట్లపై తనిఖీలు ఎక్కడ..?

మేడ్చల్: బోడుప్పల్, చెంగిచెర్ల పరిసర ప్రాంతాలలో ప్రజలు మున్సిపల్ వాటర్ బదులుగా అనేకమంది మినరల్ వాటర్ తాగుతున్న పరిస్థితి ఉంది. మినరల్ వాటర్ ప్లాంట్లలో రివర్స్ ఆస్మోసిస్ యంత్రాలు పనిచేయకున్నప్పటికీ పలుచోట్ల, మంచినీటిని మినరల్ వాటర్ పేరిట అందిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తనిఖీలు చేయాల్సిన అధికారులు అటువైపు చూడకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.