రంజాన్ తోఫా అందజేసిన ఎమ్మెల్యే
BDK: దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హాజరై ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకలను అందజేశారు. ప్రార్థనలు చేయడం ద్వారా ఆధ్యాత్మికతతో పాటు పరస్పర సహకారం సోదరభావం పెంపొందుతాయన్నారు.