ఎయిర్ షోలో వింగ్ కమాండర్ మృతి.. రష్యా నివాళి
దుబాయ్ ఎయిర్‌షోలో భారత యుద్ధ విమానం కూలిన ఘటనలో వింగ్ కమాండర్ నమాంశ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ వింగ్ కమాండర్‌కు రష్యా నివాళులర్పించింది. ఈ మేరకు ఎయిర్ షో చివరి రోజున నమాంశ్ కోసం ప్రత్యేకంగా రష్యా వైమానిదళం ప్రదర్శన చేసింది. 'విధి నిర్వహణలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిన సోదరుడి గౌరవార్థం' ఈ ప్రదర్శన చేసినట్లు ప్రకటించింది.