'కడప బ్రాహ్మణ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలి'
NDL: ఈ నెల 26న కడపలోని ఐఎంఏ హాలులో బ్రాహ్మణ చైతన్య వేదిక, కడప నగరం అర్చక పౌరోహిత సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణ సమ్మేళనం నిర్వహించనున్నట్లు శుక్రవారం నంద్యాల జిల్లా అధ్యక్షుడు కేపీవీ సుబ్బారావు తెలిపారు. ఈ సమ్మేళనానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని వెల్లడించారు. బ్రాహ్మణుల సమస్యలపై చర్చించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన ఉద్దేశమన్నారు.