VIDEO: ఇందిరమ్మ ఇల్లు తొలగించారని ఆవేదన

VIDEO: ఇందిరమ్మ ఇల్లు తొలగించారని ఆవేదన

NLG: నల్గొండ మండలం అన్నారెడ్డిగూడెంలో తనకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లును తొలగించారని ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. రాజకీయ నాయకుడి పొలంలో నాటు వేయడానికి వెళ్లలేదనే కక్షతోనే తన ఇంటిని తొలగించారని ఆమె వాపోయింది. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని. పేదరికంలో ఉన్న తనకు ఇల్లు మంజూరు చేయాలని అధికారులను వేడుకుంది.