మునుగోడులో నీటి సరఫరా నిలిపివేత

మునుగోడులో నీటి సరఫరా నిలిపివేత

SRPT: మునుగోడులో రెండు రోజులు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. గ్రామంలో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా మంచి నీటి పైపులైన్ మారుస్తున్నందున ఆదివారం సాయంత్రం నుండి మంగళవారం సాయంత్రం వరకు నీటి సరఫరా నిలివేస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు రోజులు కృష్ణా జలాల సరఫరా ఉండదని, ప్రజలు గమనించి, సహకరించాలని కోరారు.