ఎమ్మెల్యే బండారు నేటి పర్యటన వివరాలు
కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుక్రవారం పర్యటన వివరాలను వాడపాలెం కార్యాలయ సిబ్బంది గురువారం రాత్రి వెల్లడించారు. ఉదయం 10 గంటలకు రావులపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ నిర్వహిస్తారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోని వారి సమస్యలకు పరిష్కారం పొందాలని కోరారు.