రాజకీయ నేతలతో సమావేశం నిర్వహించిన సబ్ కలెక్టర్

KRNL: ఆదోనిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సోమవారం సాయంత్రం రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025లో భాగంగా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, కొత్త ఓటర్ల నమోదు అంశాలపై సమీక్షించి, నేతల నుంచి సూచనలు స్వీకరించారు. ఈ సమావేశంలో తహసీల్దారు రమేష్, ఉప తహసీల్దారు గాయత్రి పాల్గొన్నారు.