కొనుగోలు కోసం పడిగాపులు

VKB: కొడంగల్ మండలంలోని అప్పాయిపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. వరి పంటను అమ్ముకోవచ్చని రైతులు సంతోషించారు. కానీ పంట కోతల తరువాత రోడ్డుపై ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రం వద్ద 10 రోజులకుపైగా పడిగాపులు కాసినా అమ్మకాలు పూర్తి కావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.