కోతకు గురైన రోడ్డు.. రాకపోకలకు ఇబ్బందులు

కోతకు గురైన రోడ్డు.. రాకపోకలకు ఇబ్బందులు

ADB: గుడిహత్నూర్ మండలం మన్నూర్ నుండి గురుజా, శాంతాపూర్ వెళ్లే రోడ్డు వర్షానికి కోతకు గురైంది. దీంతో ఆ మార్గంలో వెళ్లే ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు అధికారులను కోరారు.