రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

BPT: కొరిశపాడు మండలం మేదరమెట్లలోని ఒంగోలు వెళ్లే రహదారి వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని వెనకనుంచి వచ్చిన బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుడిని అనమనమూరు గ్రామానికి చెందిన కవల సాంబశివరావుగా గుర్తించారు.