4 రోజుల్లో దత్తత ప్రక్రియ పూర్తి చేయండి: కలెక్టర్

ప్రకాశం: ఆగస్టు 15 నాటికి జిల్లాలో బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో మార్గదర్శకుల ఎంపికను సైతం పూర్తి చేయాలని కలెక్టర్ సుచించారు.