‘80% రైతుల వార్షికాదాయం రూ.60 వేలలోపే’
దేశంలో దాదాపు 80% మంది రైతుల వార్షికాదాయం కేవలం రూ.17,000-60,000 మధ్యే ఉందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. చిన్న భూ కమతాలు(2 హెక్టార్లలోపు), వర్షాధార సాగు, సాంకేతికత లోపం, ఒకే రకమైన పంటల సాగు వారి తక్కువ ఆదాయానికి కారణాలుగా వెల్లడించింది. గత నాలుగేళ్లలో వ్యవసాయ ఖర్చు 40% వరకు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించింది.