వినుకొండలో తెల్లవారుజామునే పారిశుద్ధ్య తనిఖీలు
PLD: వినుకొండలో పారిశుద్ధ్య పనుల నిర్వహణను పురపాలక సంఘం కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మంగళవారం తెల్లవారుజామున పరిశీలించారు. పురపాలక కార్యాలయంలో కార్మికులు హాజరైన అనంతరం, ఆయన పలు వీధుల్లో పర్యటించారు. ప్రధాన రహదారులు, వార్డుల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని, ఎక్కడా లోపాలు లేకుండా చూసుకోవాలని కమిషనర్ సిబ్బందికి సూచించారు.