గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
తూర్పు గోదావరి జిల్లా యర్నగూడెం NH5పై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వయసు సుమారు 30-40 ఏళ్లు ఉంటాయని ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 94407 96624, 94407 96584 నంబర్లను సంప్రదించాలన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.