ఎరువుల గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్.

ఎరువుల గోడౌన్ ను  తనిఖీ చేసిన కలెక్టర్.

NZB: జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎరువుల గోడౌన్ ను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం తనిఖీ చేశారు. గిడ్డంగిలో నిలువ ఉన్న ఎరువులను పరిశీలించారు. ఈ సీజన్లో ఇంకా ఎంత మొత్తంలో యూరియా ఎరువుల అవసరం ఉందో ఆరాతీశారు. స్టాక్ కొంత మిగిలి ఉండగానే, ఇండెంట్ పెట్టాలని కోరారు.