జిల్లా మార్పుపై స్థానికంగా తీవ్ర చర్చ
VZM: ఎస్.కోట నియోజకవర్గ జిల్లా మార్పుపై స్థానికంగా తీవ్ర చర్చ కొనసాగుతుంది. నవంబర్ 7వ తేదిన జరిగే మంత్రి వర్గ సమావేశంలో ఆమోదముద్ర వేయనుండడంతో ఏం జరుగుతుందో అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల హామీ మేరకు విశాఖ జిల్లాలో కలుపుతారా, లేదా విజయనగరం జిల్లాలో కొనసాగిస్తారా అనేది మరో తొమ్మిదిరోజుల్లో భవితవ్యం తేలనుంది.