ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
BHNG: మోత్కూర్ మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో PACS మోత్కూర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేందాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం గిట్టుబాటు ధరలకే రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని ఎవరు భయపడవద్దని తెలిపారు.