అది రాష్ట్ర ప్రభుత్వ విజయం: భట్టి విక్రమార్క

అది రాష్ట్ర ప్రభుత్వ విజయం: భట్టి విక్రమార్క

TG: కేంద్రం కులగణనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. 'కేంద్రం కులగణన ప్రకటన తెలంగాణ ప్రభుత్వం విజయం. తెలంగాణలో కులగణనతో దేశానికి రోల్ మోడల్‌గా నిలిచాం. ప్రభుత్వ నిర్ణయాల్లో కులగణనను పరిగణనలోకి తీసుకుంటాం. కులగణన సర్వే ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రభుత్వానికి బీసీలు అండగా ఉండాలి' అని కోరారు.