శిథిలావస్థలో భవనం.. పట్టించుకోరేం..!
WNP: వనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలోని భవనం శిథిలావస్థకు చేరింది. సంస్థానాధీశుల కాలంలో నిర్మించిన ఈ భవనంపై చెట్లు, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. ఈ భవనం పనికిరాదని అధికారులు తాళం వేసి వదిలేశారు. దీనిని పునరుద్ధరించి, విద్యార్థుల అవసరాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని పట్టణ ప్రజలు, విద్యా వేత్తలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.