సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన

సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన

MNCL: కాసిపేట మండలం కోమటిచేనులోని పత్తి పంటలను మండల వ్యవసాయ అధికారులు ప్రభాకర్, శ్రీధర్ శుక్రవారం సందర్శించారు. పత్తి కాయ దశ నుంచి పత్తితీత దశలో ఉందని, ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో చీడపీడల అధికంగా ఆశిస్తున్నందున సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. గాలి తేమతో కూడిన వేడి వాతావరణం ఉన్నందున రసం పీల్చే పురుగుల ప్రభావం ఎక్కువగా ఉందన్నారు.