టూత్‌పేస్ట్ ఎక్కువగా వాడుతున్నారా?
టూత్‌పేస్ట్ సరైన మోతాదులో వాడటం చాలా ముఖ్యం. పెద్దలు బఠాని గింజంత, 4 ఏళ్ల లోపు పిల్లలు బియ్యపు గింజంత మాత్రమే వాడాలని దంత వైద్యులు సూచిస్తున్నారు. పిల్లలు ఒకవేళ పేస్ట్ మింగితే, అందులోని అధిక ఫ్లోరైడ్ కారణంగా పళ్లపై తెల్లటి లేదా గోధుమ రంగు మచ్చలు (ఫ్లోరోసిస్) ఏర్పడవచ్చు. పేస్ట్‌లోని కొన్ని రసాయనాలు(ఉదా: SLS) నోటి లోపలి సున్నితమైన చర్మానికి చికాకు కలిగించవచ్చు.