అండర్-19 రాష్ట్ర ఉమెన్స్ జట్టు కోచ్‌గా శ్రీనివాసులు

అండర్-19 రాష్ట్ర ఉమెన్స్ జట్టు కోచ్‌గా శ్రీనివాసులు

కర్నూలు: ఈ నెల 13 నుంచి 21 వరకు ముంబైలో జరగబోయే జాతీయ స్థాయి అండర్-19 ఉమెన్స్ రాష్ట్ర జట్టుకు ఫీల్డింగ్ శిక్షకుడిగా కర్నూలు క్రికెట్ అసోసియేషన్ శిక్షకుడు శ్రీనివాసులు ఎంపికైనట్లు జిల్లా కార్యదర్శి దేవేందర్ గౌడ్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాష్ట్ర జట్టు విజయానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.