'మహాసభలను జయప్రదం చేయండి'
MBNR: మే చివరి వారంలో మహబూబ్ నగర్‌లో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నారు. వాటిని విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఇవాళ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 900 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో నేతలు ఏ. రాములు, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.