'గ్రామ అభివృద్ధికి సీసీ రోడ్లు కీలకం'

'గ్రామ అభివృద్ధికి సీసీ రోడ్లు కీలకం'

SDPT: అక్కన్నపేట మండలం సేవాలాల్ మహారాజ్ తండా గ్రామపంచాయతీ పరిధిలో సీసీ రోడ్డు నిర్మాణాన్ని సర్పంచ్ జరుపుల సునీత రాజు, ఉప సర్పంచ్ భూక్య రమ దేవి శనివారం ప్రారంభించారు. గ్రామ అభివృద్ధికి సీసీ రోడ్లు కీలకమని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు, తండా పెద్దలు పాల్గొని అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు భూక్య అనిత పాల్గొన్నారు.