జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే
MDCL: జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. జీడిమెట్ల డివిజన్ పేట్ బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గానికి చెందిన పలువురు జర్నలిస్టు సంఘాల నాయకులు ఎమ్మెల్యేను కలిసి సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.