పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

PLD: చిలకలూరిపేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం పాల్గొన్నారు. స్థానిక సచివాలయాల్లో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేరుతో నడిచే ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ మద్దతు అందుతుందని పేర్కొన్నారు. TDP ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు.