ప్రతి డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా: MLA

ప్రతి డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా: MLA

HNK: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని MLA నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ కాజీపేటలోని ఇందిరా నగర్‌లో సుమారు రూ. కోటి వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు స్థానిక ప్రజలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రతి డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, ప్రజలు అభివృద్ధి పనుల్లో భాగస్వాములై సహకరించాలని ఆయన కోరారు.