చలివేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ ఛైర్మన్

చలివేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ ఛైర్మన్

PDPL: పెద్దపల్లిలోని జెండా చౌరస్తా వద్ద సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ ఛైర్మన్ నూగిల్ల మల్లయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండల దృష్ట్యా ప్రజల కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సత్య సాయి సేవ సమితి సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.