'కానిస్టేబుల్ ప్రమోద్‌ను హత్య చేయడం దుర్మార్గం'
SDPT: మిరుదొడ్డి మండలం పెద్దచెప్యాల గ్రామానికి చెందిన దళిత యువకుడు, పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్‌ను రౌడీషీటర్ రియాజ్ హత్య చేయడం దుర్మార్గమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన నిజామాబాద్‌లో ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించి, సంతాపం తెలిపారు. ప్రమోద్ చిత్రపటానికి నివాళులర్పించారు.