నెలలో జరీబు భూముల పరిష్కారం: పెమ్మసాని
AP: అమరావతిలో జరీబు భూముల సమస్యల పరిష్కారానికి నెల రోజుల సమయం పడుతుందని, సాయిల్ టెస్ట్ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి చంద్రశేఖర్ అన్నారు. రాజధాని గ్రామాల్లో సామాజిక అభివృద్ధి కోసం కమ్యూనిటీ హాల్స్, శ్మశానాలతోపాటు మౌలిక వసతులు కల్పిస్తామని, పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్యను కూడా పెంచుతామని తెలిపారు. భూసమీకరణకు భూములు ఇవ్వని రైతులతో మరోసారి చర్చిస్తామన్నారు.