దోపిడీకి పాల్పడిన నిందితులపై కేసు నమోదు: CI
ADB: దోపిడీకి పాల్పడిన ఇద్దరి నిందితులపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ నాగరాజు ఆదివారం తెలిపారు. ఈ మేరకు పట్టణానికి చెందిన నిందితులు దండేవర్ అనికేష్, పిలివర్ రాజేష్ నుంచి సెల్‌ఫోన్, రూ. 1,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. రౌడీయిజం చేస్తూ, దోపిడీలకు పాల్పడిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.