త్రాగునీరు వృధా.. బురదమయంగా వీధులు
BDK: పినపాక మండలం సీతంపేట గ్రామం బెస్తగూడెంలో మిషన్ భగీరథ త్రాగునీరు వృధాగా పోతోంది. దీంతో పరిసరాలు బురదమయంగా మారాయి. దీనివల్ల గ్రామస్తులు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై సంబంధిత పంచాయతీ అధికారులు, పాలకవర్గం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.