పాక్‌కు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్పాలి: భగవత్
పాక్‌కు అర్థమయ్యే భాషలోనే భారత్ సమాధానం చెప్పాలని RSS అధిపతి మోహన్ భగవత్ అన్నారు. ఓ స్నేహితుడిగా భారత్‌కు సహకరిస్తేనే దాయాది దేశానికి మేలు జరుగుతుందని హితవు పలికారు. ఈ సందర్భంగా RSS రిజిస్ట్రేషన్‌పై స్పందించారు. హిందూ ధర్మం కూడా ఎక్కడా నమోదు చేసుకోలేదని.. అదే విధంగా RSS ప్రత్యేకంగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.