లక్ష్మీనరసింహ ఆలయంలో కార్తీక దీపోత్సవం వేడుకలు

లక్ష్మీనరసింహ ఆలయంలో కార్తీక దీపోత్సవం వేడుకలు

ATP: రాయదుర్గం మండలం మల్లాపురం గ్రామంలో కొండపై వెలసిన నవ లక్ష్మీనరసింహ ఆలయంలో మంగళవారం సాయంత్రం కార్తీక దీపోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అందులో బాగంగానే నేడు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి కార్తీకదీపం వేడుకలు నిర్వహించనున్నారు. భక్తులు పాల్గొనాలని సూచించారు.