ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వర్క్‌షాప్ విజయవంతం

అన్నమయ్య: రైల్వే కోడూరులోని వెలుగు కార్యాలయ స్త్రీ శక్తి భవన్‌లో గురువారం ఏపీఎంఎస్‌ఎంఇ మరియు జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వర్క్‌షాప్ జరిగింది. ఇందులో భాగంగా ఐపీవో నాగార్జున మాట్లాడుతూ.. ఉచిత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వల్ల వ్యాపార, సేవా రంగాల వారు లాభపడుతున్నారని తెలిపారు. ఏపీఎంపీ వసుంధర మహిళలు ఆహార ఉత్పత్తుల్లో అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు.