డిజిటల్ అరెస్ట్ పేరిట టోకరా.. ముఠా అరెస్ట్

డిజిటల్ అరెస్ట్ పేరిట టోకరా.. ముఠా అరెస్ట్

AP: డిజిటల్ అరెస్ట్ పేరిట మోసాలకు పాల్పడుతున్న ముఠాను అన్నమయ్య పోలీసులు అరెస్ట్ చేశారు. మదనపల్లికి చెందిన ఓ 75 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.48 లక్షలు కొట్టేశారు. మీ పేరు మీద CBI, ED కేసు నమోదు అయిందని ఫోన్‌లో బెదిరించి డబ్బులు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.32 లక్షల నగదు, 25 ATM కార్డులు, 3 సెల్ ఫోన్లులను స్వాధీనం చేసుకున్నారు.