ఇరాన్‌కు ప్రయాణాలు పెట్టుకోవద్దు: భారత్

ఇరాన్‌కు ప్రయాణాలు పెట్టుకోవద్దు: భారత్

ఇరాన్‌కు ఇప్పట్లో ఎవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దని భారతీయులకు అక్కడి భారత ఎంబసీ సూచించింది. ఇరుదేశాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయనే ప్రచారం నేపథ్యంలో ఈ సూచన చేసింది. పశ్చిమాసియాలో గగనతల ఆంక్షలు, ప్రాంతీయ ఉద్రిక్తల వల్ల విమాన సర్వసులపై ప్రభావం పడుతోందని పేర్కొంది. ఇరాన్‌లో ప్రస్తుతం ఉన్నవాళ్లు కూడా నిర్దేశిత మార్గాల ద్వారా తిరిగి వెళ్లాలని సూచించింది.