సాలూరులో దొంగతనం

సాలూరులో దొంగతనం

PPM: సాలూరు పట్టణంలోని కోలగట్ల వీధిలో కోట దేవి ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబంతో కలిసి ఒడిశాలోని గుప్తేశ్వరం తీర్ధయాత్రకు ఈనెల 2న వెళ్లారు. శుక్రవారం ఇంటికి వచ్చేసరికి ఇంట్లో బీరువాలు తెరిచి వుండడం గమనించారు.15 తులాల బంగారం, వెండి సామాగ్రి చోరీకి గురయ్యాయని టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్ టీంతో రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.