రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ

W.G: పాలకొల్లు పట్టణంలోని శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి సోమవారం టీటీడీ దేవస్థానం పాలకమండలి మాజీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ మాజీ జడ్పీ ఛైర్మన్ శ్రీ మేకా శేషుబాబు స్వామివారి ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.