రేపే 'విశ్వావసు' నామ సంవత్సరారంభం..!
ELR: జిల్లావ్యాప్తంగా 'ఉగాది' పండుగ వాతావరణం నెలకొంది. నేడు చైత్ర అమావాస్య కావడంతో భక్తులు పితృ కార్యాలు, పుణ్యస్నానాల్లో నిమగ్నమయ్యారు. రేపు తెలుగు నూతన సంవత్సరం 'విశ్వావసు' ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలు ముస్తాబయ్యాయి. భక్తుల కోసం ఉగాది పచ్చడి ప్రసాదం, సాయంత్రం వేళ పండితులచే పంచాంగ శ్రవణం నిర్వహించేందుకు ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.