మదనపల్లెని'శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా మార్చాలి'

మదనపల్లెని'శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా మార్చాలి'

CTR: పుంగనూరు పట్టణం బిఎంఎస్‌క్లబ్ ఆవరణంలో బలిజ కులస్తుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా రాయల్ పీపుల్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి మధు రాయల్ మాట్లాడుతూ.. మదనపల్లె కేంద్రంగా కొత్తగా ఏర్పడనున్న జిల్లాకు శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం దీనికి బలిజ సంఘాల నాయకులు, సభ్యులు మద్దతు ఇవ్వాలని కోరారు.